: బిజినెస్ పార్ట్ నర్ ను పెళ్ళాడనున్న దియా మీర్జా
బాలీవుడ్ తార, హైదరాబాదీ ముద్దుగుమ్మ దియా మీర్జా త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ ను వివాహమాడబోతోంది. వ్యాపార భాగస్వామి అయిన సాహిల్ సంగాతో జీవితం పంచుకోవాలని దియా నిర్ణయించుకుంది. దియా.. సాహిల్, జయేద్ ఖాన్ లతో కలిసి 'బోర్న్ ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్' అనే ప్రొడక్షన్ సంస్థను నడుపుతోంది. దియా తన బ్యానర్ పై 'లవ్ బ్రేకప్స్ జిందగీ' అనే చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ క్యూట్ గాళ్ నేడు ముంబయిలో మీడియాతో ముచ్చటిస్తూ.. సాహిల్ అభిరుచులు, తనవీ ఒకటే అని, అతనో అద్భుతమైన వ్యక్తని కొనియాడింది. ఇక వైవాహిక జీవితం ఎలా ఉంటుందో అని చాలా టెన్షన్ గా ఉందని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.