: తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యం: వేణుగోపాలాచారి
గులాబీ కండువా ధరించిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి.. కేసీఆర్ ను వేనోళ్ళ కీర్తిస్తున్నారు. ఈ సాయంత్రం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన వేణుగోపాలాచారి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ పుట్టిందని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ తోనే తెలంగాణ సాధ్యమంటూ విధేయత ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.