: చివరి రోజు సెంటిమెంట్.. పెరిగిన టెలిగ్రామ్ సేవల రద్దీ
160 ఏళ్ళుగా భారత ప్రజలతో మమేకమైన టెలిగ్రాం సేవలకు ఈ రోజుతో భారత పోస్టల్ శాఖ స్వస్తి పలుకుతున్న నేపథ్యంలో.. ఈ సేవలను చివరిసారిగా ఉపయోగించుకునేందుకు ప్రజలు పోస్టాఫీసులకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తమ సన్నిహితులకు, ఆప్తులకు సందేశాలు పంపేందుకు వేలాదిగా వస్తుండడంతో రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని టెలిగ్రాఫ్ సీనియర్ జనరల్ మేనేజర్ షమీమ్ అక్తర్ తెలిపారు. సిబ్బందిని కూడా పెంచుతున్నామని ఆయన వెల్లడించారు.