: కిరణ్ ను విమర్శిస్తున్న దేవినేని ఉమ


టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతామంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసనసభలో ప్రకటిస్తే.. అదేమీ పట్టించుకోకుండా సీఎం కిరణ్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కృష్ణానదిపై ఉత్తర కర్ణాటకలో నిర్మించిన ఈ డ్యామ్ ఎత్తు ఇంకా పెంచితే.. కనీసం తాగేందుకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉత్పన్నమవుతుందని దేవినేని ఉమ అన్నారు. సిద్ధరామయ్య ప్రకటన ఆంధ్రప్రదేశ్ రైతుల నోట్లో మట్టికొట్టే విధంగా ఉందని ఉమ దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News