: వీరప్పన్ అనుచరుల ఉరిశిక్ష అమలు ఆరు నెలలు వాయిదా


గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ నలుగురు అనుచరులకు ఉరిశిక్ష అమలును మరో ఆరు నెలలపాటు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కర్ణాటకలో మందుపాతర పెట్టి 22 మంది పోలీసుల మృతికి కారణమైన కేసులో వీరికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

వీరప్పన్ అనుచరుల క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో వారి ఉరిశిక్ష అమలుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. దీంతో రాష్ట్రపతి నిర్ణయంపై నేరస్తులు మరల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్ కూడిన ధర్మాసనం...  ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నేరస్తులను ఉరి తీయకూడదని ఆదేశాలు జారీ చేసింది. 

  • Loading...

More Telugu News