: అన్ని పాఠశాలల్లో చెస్ తప్పనిసరి చెయ్యాలి: ప్రభుత్వానికి రాష్ట్ర చెస్ సంఘం ప్రతిపాదన


చదరంగం క్రీడను ఇక నుంచి అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు రాష్ట్ర చెస్ సంఘం వెల్లడించింది. హైదరాబాద్ యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ రోజు జాతీయ టీమ్ చెస్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర చెస్ సంఘం అధికారులు విలేకరులతో మాట్లాడారు. కాగా, ఈ పోటీల్లో 200 మంది క్రీడాకారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రాండ్ మాస్టర్లు పాల్గొంటున్నారు. మన రాష్ట్రానికి చెందిన ద్రోణవల్లి హారిక, లలిత్ బాబు తదితర గ్రాండ్ మాస్టర్లు కూడా ఈ చాంపియన్ షిప్ లో తలపడనున్నారు.

  • Loading...

More Telugu News