: స్పేస్ సూట్లోనే మూత్ర విసర్జన చేసిన వ్యోమగామి
మూత్రం అర్జెంటుగా వస్తుంటే చిన్నపిల్లలు ఏంచేస్తారు? తమ లాగులు, గౌనులు తడిపేసుకుంటారు. ఈ అమెరికా వ్యోమగామి కూడా అలానే చేశాడు. 1961లో అలెన్ షెపర్డ్ అనే అమెరికా వ్యోమగామి అంతరిక్షంలో ఓ ప్రాజెక్టులో లీనమైన సమయంలో.. 'ఏం చేయమంటారండీ, ఒంటేలొస్తున్నాయి?' అని తమ గ్రూప్ లీడర్ ను అడగ్గా.. అతగాడు.., 'ఇంకేంచేస్తావులే నాయనా, నువ్వేసుకున్న స్పేస్ సూట్లోనే పని కానిచ్చేయ్' అని మార్గదర్శనం చేశాడట. చెప్పిందే తడవుగా.. మూత్రాశయాన్ని అరనిమిషం వ్యవధిలో ఖాళీ చేసి ఓ భారీ నిట్టూర్పు విడిచాడు అలెన్ షెపర్డ్. ఇంతకీ ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటారా... అమెరికా వాయు, అంతరిక్ష మ్యూజియంలో చరిత్రకారుడిగా పనిచేస్తున్న హంటర్ హోలిన్స్ అనే వ్యక్తి.. 'ద రైట్ స్టఫ్' అనే పుస్తకం తిరగేస్తుండగా షెపర్డ్ గారి పిల్లచేష్ట తాలూకు వివరాలు కనిపించాయట.