: తీహార్ జైల్లో హిందూ ఖైదీల రంజాన్ ఉపవాసం


ఢిల్లీలోని తీహార్ జైలు ఖైదీలు మత సామరస్యాన్ని చాటుతున్నారు. 45 మంది హిందూ ఖైదీలు రంజాన్ మాసం సందర్భంగా తామూ ఉపవాసాలు ఉంటున్నారు. తోటి ముస్లిం ఖైదీలతో పాటే వీరు కూడా రోజూ ప్రార్థనలు ఆచరిస్తున్నారు. ఈ విషయమై తీహార్ జైలు న్యాయాధికారి సునీల్ గుప్తా మాట్లాడుతూ, జైల్లో 1800 మంది ముస్లిం ఖైదీలు ఉన్నారని, వారితో పాటే హిందూ ఖైదీలు కూడా రంజాన్ దీక్ష పాటించడం అభినందించాల్సిన విషయమన్నారు. కాగా, రంజాన్ దీక్ష ఆచరించేవారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని గుప్తా తెలిపారు.

  • Loading...

More Telugu News