: బాలికపై అత్యాచారం చేసిన యువకుడికి ఏడేళ్ళ జైలు
16 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన 20 ఏళ్ళ ఢిల్లీ యువకుడు ప్రశాంత్ కు స్థానిక అడిషనల్ సెషన్స్ కోర్టు 7 ఏళ్ళ జైలు శిక్ష, 20 వేల రూపాయల జరిమానా విధించింది. బాలికను అపహరించి, మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగించి, ప్రశాంత్ పలుమార్లు అత్యాచారం చేశాడు. నేరం నిరూపితం కావడంతో కోర్టు అతడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.