: నెట్ వాడకంలో మన లేడీస్ ఎక్కువే!
మనదేశంలో ఇంటర్నెట్ వాడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోందట. భారతదేశం మొత్తం మీద ఇంటర్నెట్‌ను వాడేవారి సంఖ్య 150 మిలియన్లకు పైగా ఉన్నారు. అయితే వీరిలో 6 కోట్లమంది మహిళా నెట్ వినియోగదారులున్నట్టు గూగుల్ ఇండియా సర్వేలో వెల్లడైంది.
ఇంటర్నెట్‌లో మహిళలు ఎక్కువగా దుస్తులకు సంబంధించి వివరాలకోసం, ఇంకా చర్మ రక్షణ కోసం, వివిధ రకాల పానీయాలు, ఆహారం, వంటలు వంటి వాటికోసం ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నట్టు ఈ సర్వేలో తేలింది. సమాచారం కోసం మొబైల్ ఫోన్ల ద్వారా మహిళలు విచారించేది కూడా ఇలాంటి వాటికోసమేనట. ఇంటర్నెట్ వల్ల మహిళలకు సాధికారత కలుగుతున్నట్టు ఈ సర్వే ద్వారా స్పష్టమవుతోందని గూగుల్ సంస్థ చెబుతోంది.