: మనిషిలా పగటికలలు కనే కంప్యూటర్!


టెక్నాలజీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా పరిశోధకులు అచ్చు మనిషిలా పగటికలలు కనే కంప్యూటర్ కు రూపకల్పన చేస్తున్నారట. మనిషి మెదడు కణాల గతిజనియమాలను అనుసరించి అవి ఇతర అవయవాల కణాలతో ఏర్పరచుకునే సంబంధాలను పరిశీలించిన మీదట.. అలాంటిదే ఓ కృత్రిమ మెదడును రూపొందించారు. మనిషి పగటికలలు కనే సమయంలో మెదడులోని భాగాలు ఎలా ఒకదానితో ఒకటి సమన్వయ పరుచుకుంటాయన్న విషయాన్ని ఈ కొత్త నమూనా మెదడు ద్వారా తెలుసుకోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మెదడుకయ్యే గాయాలకు చికిత్స చేయడంలో ఈ పరిశోధన ఉపయోగపడుతుందని వాషింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు అంటున్నారు.

  • Loading...

More Telugu News