: కొత్త ప్రాజెక్టులు తేవడంలో కాంగ్రెస్ ఎంపీలు విఫలం: నామా
రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో ఎంపికైన కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు బడ్జెట్ విషయానికొచ్చేసరికి కొత్త ప్రాజెక్టులు తేవడంలో విఫలమవుతున్నారని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పార్టీ ఎలా చెబితే అలా నడుచుకుంటామని నామా చెప్పారు. అయితే, బడ్జెట్ సమావేశాల్లో రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా చర్చించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై కేంద్రం ఇకనైనా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.