: రాష్ట్రపతితో సీఎం కిరణ్ భేటీ
హస్తినలో మకాం వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఆయనతో తెలంగాణ అంశంపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. నిన్నటి కోర్ కమిటీ భేటీలోనూ సమర్థవంతంగా తన వాదనలు వినిపించిన సీఎం నేడు రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమైక్యాంధ్రకే కిరణ్ మద్దతిస్తున్నాడని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.