: విశాఖలో వ్యభిచారం ముఠా గుట్టురట్టు.. డాక్టర్ భార్య అరెస్టు
విశాఖపట్నంలో నేడు ఓ హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. ఇక్కడి బీచ్ రోడ్డులోని ఓ అపార్ట్ మెంటులో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, అరెస్టయిన వారిలో ఓ వైద్యుని భార్య కూడా ఉండడం విస్తుగొలుపుతోంది.