: 'ఉత్త'రాంధ్రపై రౌండ్ టేబుల్ సమావేశం


ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఆధ్వర్యంలో 'ఉత్తరాంధ్ర కోసం రోడ్ మ్యాప్' అంశంపై విశాఖపట్నంలోని పార్క్ హోటల్ లో నేడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, నీటిపారుదల సౌకర్యాలు, రహదారులు, పోర్టులు తదితర అంశాలపై వారు చర్చించారు. తెలంగాణ జిల్లాలతో పోల్చితే ఉత్తరాంధ్ర జిల్లాలు ఎంతో వెనుకబడి ఉన్నాయని, వీటన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేసి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ కు అందజేస్తామని రక్షణ వేదిక నాయకులు అన్నారు. ఇక, చర్చించిన అంశాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని సమావేశంలో పాల్గొన్న విప్ ద్రోణంరాజు శ్రీనివాసరావు చెప్పారు. ఈ సమావేశంలో పలు రంగాలకు చెందిన మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News