: మోడీ.. భారత జాతీయుడిలా బతుకు: దిగ్విజయ్ హితవు


తాను హిందువుగా పుట్టానని, హిందూ జాతీయవాదిగానే ఉంటానని ఉద్ఘాటించిన గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హితవు పలికారు. విభజన రాజకీయాలు మాని, భారత జాతీయుడిలా బతకాలని సూచించారు. దిగ్విజయ్ నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, మోడీని తూర్పారబట్టారు. మత ప్రాతిపదికన జాతి జనులను విభజించే యోచన విరమించుకోవాలని సలహా ఇచ్చారు. 'మనమందరం భారత జాతీయులం కాకుండా.. హిందూ జాతీయవాది, ముస్లిం జాతీయవాది, క్రైస్తవ జాతీయ వాదులం అవుతామా?' అంటూ డిగ్గీ రాజా ప్రశ్నించారు. ఇక సావర్కర్, జిన్నాల మాదిరే మహోన్నత జాతిని మతం పేరిట విడగొట్టాలని చూడొద్దని సంఘ్ పరివార్ కూ హితవు పలికారు.

  • Loading...

More Telugu News