: పాక్ లో అమానుషం.. క్రైస్తవ మహిళలను నగ్నంగా ఊరేగింపు


పాకిస్తాన్ లో మానవీయ విలువలు అడుగంటిపోతున్నాయి. ఓ భూస్వామి ముగ్గురు క్రైస్తవ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. నెలరోజుల క్రితం ఈ దారుణం జరగ్గా.. లాహోర్ హైకోర్టు నిన్న విచారణకు ఆదేశించింది. వివరాల్లోకెళితే పంజాబ్ ప్రావిన్స్ లోని పట్టోకి అనే గ్రామంలో మహ్మద్ మునీర్ పెద్ద భూస్వామి. సాదిక్ మాసిహ్ అనే వ్యక్తికి ముగ్గురు కొడుకులు కాగా.. వారితో మునీర్ కు పశువుల విషయంలో వివాదం తలెత్తింది. దాంతో, తన మనుషులను సాదిక్ ఇంటికి పంపి అతని ముగ్గురు కుమారులను తీసుకురమ్మని పురమాయించాడు. వారు ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో వారి ముగ్గురు భార్యలను ఎత్తుకొచ్చారు మునీర్ అనుచరులు.

వారిని నానా దుర్భాషలాడడమే గాకుండా, బట్టలూడదీసి గ్రామవీధుల్లో నడిపించారు. ఆ అబలలు సహాయం కోసం అర్థించగా.. కొందరు పెద్దలు మునీర్ ను వేడుకున్నారు. ఆ మహిళలను వదిలేయమని ప్రాధేయపడగా, అప్పటికిగానీ ఈ భూస్వామి కోపం చల్లారలేదు. ఈ ఘటన కిందటి నెల మొదటి వారంలో చోటు చేసుకోగా.. ఇన్నాళ్ళకు వెలుగు చూసింది. ఆసియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ దారుణంపై మీడియాలో ఎలుగెత్తగా.. స్పందించిన లాహోర్ హైకోర్టు విచారణకు రెండు వారాల్లోగా నివేదిక అందించాలంటూ సెషన్స్ న్యాయమూర్తి కసూర్ ను ఆదేశించింది.

  • Loading...

More Telugu News