: భద్రం బ్రదరూ.. నామినేషన్ దొంగలున్నారు!
ఇళ్లకు కన్నాలేసే వారి గురించి విన్నాం, బ్యాంకుల్ని దోపిడీ చేసే వారి గురించి విన్నాం. కానీ, నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లే దొంగల గురించి వినలేదు కదా... ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చేశారు! వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఎన్నికల సిత్రాల్లో ఇదో విచిత్రం. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజారెడ్డి నామినేషన్ వేయగా, అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు నామినేషన్ పత్రాలను దౌర్జన్యంగా తీసుకువెళ్లారు. ఆ సమయంలో పోలీసులు నామినేషన్ కేంద్రం వద్ద లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే, నామినేషన్ పత్రాలు ఎత్తుకెళ్లిన వారు కాంగ్రెస్ వర్గీయులని పోలీసులు అనుమానిస్తున్నారు.