: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీజేపీ ఆందోళన
కేంద్ర హోం మంత్రి షిండేకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీజేపీ సీనియర్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ తో పాటు..నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు హిందూ టెర్రరిజం అంటూ షిండే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పాకిస్థాన్ సమర్ధించడాన్ని... భారత్ ను కొట్టేందుకు పాక్ చేతికి బెత్తం ఇవ్వడం వంటిదని బీజేపీ అధికార ప్రతినిధి జవదేకర్ అన్నారు. 'ఎందుకంటే పాకిస్థాన్ లో హింసకు కూడా హిందూ తీవ్రవాదమే కారణమని పాక్ ఆరోపిస్తోంది. 65ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో మతానికి తీవ్రవాదం రంగు పులిమిన ఘనత షిండేకే చెల్లింద'ని ఆయన విమర్శించారు.