: ఏకగ్రీవ పంచాయతీలకు బంపర్ ఆఫర్


ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలను ప్రభుత్వం మరింత పెంచింది. గతంలో రూ.5 లక్షలు ప్రోత్సాహకంగా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. ఆ మొత్తాన్ని రూ.8లక్షలకు పెంచాలంటూ ఆర్ధిక శాఖకు పంచాయతీరాజ్ శాఖ తాజాగా ప్రతిపాదించింది. ఆర్ధిక మంత్రి రామనారాయణ రెడ్డి రూ.7 లక్షల పెంపునకు అంగీకరిస్తూ దస్త్రాన్ని ముఖ్యమంత్రికి పంపించారు. దీంతో ఈసారి ఏకగ్రీవ ఎన్నిక జరిగే పంచాయతీలకు సుమారు రూ.7 లక్షల నుంచి జనాభాను బట్టి రూ.25 లక్షల వరకూ అందజేసేందుకు నిర్ణయించింది. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు ఉండకుండా అభివృద్ధి పథంలో పయనించేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈ ప్రోత్సాహకాలకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో రూ.147 కోట్లను పంచాయతీల ప్రోత్సాహానికి కేటాయించగా తాజా నిర్ణయంతో రూ.230 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News