: గోదారమ్మ ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయి


భారీ వర్షాల కారణంగా గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు కారణంగా ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద నీటిమట్టం 33 అడుగులు దాటింది. నీటి మట్టం ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏజెన్సీలోని పలు ప్రాంతాలకు రవాణా మార్గాలు మూసుకుపోయాయి. భద్రాచలం పట్టణం సహా నదీ పరీవాహక ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సబ్ కలెక్టర్ అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ఆపదలో ఉన్న వారికి సాయం అందించేందుకు ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. 08742-231600 నంబర్ కు కాల్ చేస్తే సాయం అందిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు రాజమండ్రి వద్ద కూడా గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. లక్షా యాభై వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడిచి పెడుతున్నారు.

  • Loading...

More Telugu News