: అణు విద్యుత్తు వచ్చేస్తోంది
కూడంకుళం అణువిద్యుత్తు కేంద్రం ఒకట్రెండు రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించనుంది. వెయ్యి మెగావాట్ల తొలి అణు రియాక్టర్ కు సంబంధించి ఎఫ్ఏసీ (ఫస్ట్ అప్రోచ్ టు క్రిటికాలిటీ) అనుమతి ఎఈఆర్బీ గురువారం ఇచ్చిందని ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి నారాయణస్వామి చెన్నైలో తెలిపారు. ప్రాజెక్టు జాప్యానికి ఉద్యమకారులే కారణమని, ఇక ఉత్పత్తి ప్రారంభించడమే తరువాయని ఆయన అన్నారు. అణు రియాక్టర్ కు ఎఈఆర్బీ అనుమతి ఇవ్వడంపై దీన్ని వ్యతిరేకిస్తున్న వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ జీవితాల భద్రతకు కొన్నేళ్లుగా స్థానికులు ఉద్యమాలు చేస్తుంటే అనుమతి ఇవ్వడం అప్రజాస్వామికమని ఉద్యమకారులు అంటున్నారు.