: కాగితాలకే పరిమితమైన రాష్ట్రాభివృద్ధి: టీడీపీ


రాష్ట్రంలో అభివృద్ధి కాగితాలకే పరిమితమైందని టీడీపీ ఆరోపించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2004 నుంచి నేటి వరకు 7 లక్షల 50వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రభుత్వం చూపిందని, అలాగే పన్నుల పేరుతో ప్రజలపై 70వేల కోట్లు భారం మోపిందని ఆయన ఆరోపించారు. ఇంత ప్రజాధనం వినియోగించినా.. అదే స్థాయిలో అభివృద్దిని మాత్రం ప్రభుత్వం చూపలేకపోతోందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News