: 'సీఎం ప్రజెంటేషన్ సూపర్' అంటున్న మంత్రి గంటా


ప్రత్యేక రాష్ట్రం అంశంపై చర్చించేందుకు ఢిల్లీలో నేడు జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమర్పించిన ప్రజెంటేషన్ 'సూపర్' అంటున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. సీఎం చెప్పిన వివరాలతో కోర్ కమిటీ సభ్యులు సంతృప్తి చెందారని వెల్లడించారు. తద్వారా రాష్ట్రం విడిపోదన్న నమ్మకం ఏర్పడిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం కిరణ్ సమర్థవంతంగా వ్యవహరించారని గంటా కితాబిచ్చారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో సోనియా, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, ఆజాద్, ఆంటోనీ, డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఎం కిరణ్ తన ప్రజెంటేషన్ లో భాగంగా దాదాపు గంటపాటు అధినాయకత్వానికి పలు విషయాలను స్పష్టీకరించారు.

  • Loading...

More Telugu News