: రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది: శైలజానాథ్
రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని మంత్రి శైలజానాథ్ తెలిపారు. కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీపై స్పందించిన మంత్రి, రాష్ట్రం విడిపోతుందని తాను భావించడం లేదన్నారు. విస్తృతస్థాయి సమావేశంలో చర్చించాలన్న అధిష్ఠానం నిర్ణయం సరైనదేనని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు ఎవరికి తోచింది వారు మాట్లాడతారని, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని శైలజానాథ్ అన్నారు.