: రేపు తెలంగాణలో విద్యాసంస్థల బంద్
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ రాజకీయ జేఏసీ రేపు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. జేఏసీ కన్వీనర్ కోదండరాం మాట్లాడుతూ, వచ్చే నెల 15 నుంచి జనచైతన్యయాత్రలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని సాగదీస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని కోదండరాం హెచ్చరించారు.