: నిండుకుండను తలపిస్తున్న హుస్సేన్ సాగర్
హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వానలతో హుస్సేన్ సాగర్ పోటెత్తింది. హుస్సేన్ సాగర్ గరిష్ఠ నీటి మట్టం 513.41 మీట్లరకు చేరింది. దీంతో హుస్సేన్ సాగర్ దిగువనున్న లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అరుంధతినగర్, అంబేద్కర్ నగర్, అరవింద్ నగర్, దత్తానగర్, రత్నానగర్, ఆనంద్ నగర్, దోమల గూడ, అశోక్ నగర్ తదితర ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యే అవకాశముండడంతో స్థానికులు పునరావాస కేంద్రాలకు తరలేందుకు సిద్దంగా ఉండాలని మైకుల్లో అధికారులు హెచ్చరించారు.