: బుడగలా ఉబ్బించి గాలి తీశారు: టీఎన్జీవోలు
తెలంగాణ అంశంపై తమ ఆశల అంచనాలను బుడగలా ఉబ్బించి, గుండుసూదితో గుచ్చి తుస్సుమని గాలి తీశారని తెలంగాణ ఎన్జీవో సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ మరోసారి తమ మనోభావాలతో ఆడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా విడిపోదామని అందరూ భావిస్తున్న తరుణంలో, విభజన అంశాన్ని మరికొంత కాలం పొడిగించడం ద్వారా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని వారు ఆరోపించారు.