: రోడ్ మ్యాప్ లతో ఏం సాధించారు?: కిషన్ రెడ్డి


కాంగ్రెస్ నేతలు రోడ్ మ్యాప్ లతో ఏం సాధించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అంశంపై కోర్ కమిటీ భేటీ అనంతరం నిర్ణయాన్ని వర్కింగ్ కమిటీలో ప్రకటిస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. హైదరాబాద్ లో ఆయన ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే, సీడబ్ల్యూసీలో తెలంగాణపై తుదినిర్ణయం వెలువరిస్తామని చెబుతున్న కాంగ్రెస్ కు, నాలుగేళ్ళుగా ఈ విషయం గుర్తుకు రాలేదా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ కోర్ కమిటీలు, వర్కింగ్ కమిటీలంటూ కాలయాపన చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

  • Loading...

More Telugu News