: తెలంగాణ భారం ఇక కాంగ్రెస్ దే..


అన్ని పార్టీల వాదనలు విన్నామని, నేతల రోడ్ మ్యాప్ నివేదికలు పరిశీలించామని రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పిన నేపథ్యంలో... ఇక తెలంగాణపై తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టమవుతోంది. ప్రత్యేక రాష్ట్ర అంశం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొనడం ద్వారా.. ఇక తెలంగాణ విషయం కాంగ్రెస్ పైనే ఉందని దిగ్విజయ్ చెప్పకనే చెప్పినట్టయింది. ప్రధాని నివాసంలో ఈ సాయంత్రం జరిగిన కోర్ కమిటీ భేటీ ముగిసిన అనంతరం దిగ్విజయ్ మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News