: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: భన్వర్ లాల్


రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ చెప్పారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఊదారంగు స్కెచ్ పెన్నుతోనే ఓటు హక్కు వినియోగించుకోవాలని భన్వర్ లాల్ సూచించారు. వాటిని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్టు ఆయన వెల్లడించారు.

కాగా, 14 జిల్లాల్లో 6 నియోజక వర్గాల పరిధిలో జరుగుతున్న ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 83 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఓటర్ల సంఖ్య 6 లక్షల 32 వేల మంది కాగా, 1437 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు భన్వర్ లాల్ వివరించారు. ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు ఉంటుందని ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 25న జరుగుతుంది. అదే రోజున విజేతలను ప్రకటించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News