: ఆభరణాల ప్రదర్శన జ్యుయల్స్ ఏషియా-2013 ప్రారంభం
ఆభరణాల ప్రియుల కోసం భాగ్యనగరంలో శుక్రవారం ఓ ప్రదర్శన ఏర్పాటైంది. జ్యుయల్స్ ఏషియా-2013 పేరిట బంజారా హిల్స్ లోని తాజ్ కృష్ణా హోటల్ లో ఈ రోజు ఖరీదైన ఆభరణాల ప్రదర్శన ప్రారంభమైంది. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో కనీస స్థాయి నుంచి అత్యంత ఖరీదైన ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. దేశవ్యాప్తంగా ప్రముఖంగా పేరొందిన 10 జ్యుయలరీ సంస్థలు పాల్గొననున్నాయని నిర్వాహకులు తెలిపారు.