: ఎవరు చెప్పారు.. నేను రాజీనామా చేస్తానని?: సీఎం కిరణ్


తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం వెలువరిస్తే తాను రాజీనామా చేస్తానని వస్తున్న వార్తలను సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. రాజీనామా చేస్తానని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. ఆధారాల్లేకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ఏమైనా, అధినేత్రి సోనియా గాంధీ పట్ల తనకు విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News