: ముస్లిం ఉద్యోగులకు 'రంజాన్' వెసులుబాటు


రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటు కల్పించింది. సాయంకాలం ప్రార్థనల కోసం వారు 4 గంటలకే కార్యాలయాలను వీడవచ్చని తెలిపింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వెసులుబాటు ఆగస్టు 8 వరకు అమల్లో ఉంటుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఇది వర్తిస్తుంది.

  • Loading...

More Telugu News