: సీఎం రాజీనామా చేస్తారా.. వట్టిదే!: పొంగులేటి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారంటూ వచ్చిన వార్తలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖండించారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా, సీఎం సహజన్యాయ సూత్రాన్ని అనుసరిస్తారని పొంగులేటి అన్నారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు అనుకూల నిర్ణయం వస్తే సీఎం రాజీనామా చేస్తారంటూ వస్తున్న ఊహాగానాలన్నీ అవాస్తవాలన్నారు.