: రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించం: దిగ్విజయ్
అందరినీ ఆశ్చర్యపరిచే ప్రకటనను ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించబోమని చెప్పారు. బీజేపీ తరఫున నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వం కాంగ్రెస్ కు సవాలేనన్న వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అయితే, ప్రధానిగా మరోసారి మన్మోహన్ సింగ్ కు అవకాశం కల్పించే విషయాన్ని దిగ్విజయ్ స్పష్టం చేయలేదు.