: సీఎం పెంపుడు కుక్క.. జయప్రకాష్: ఎర్రోళ్ల
ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డిపై టీఆర్ఎస్ సేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పెంచి పోషిస్తున్న కుక్కగా జయప్రకాష్ రెడ్డిని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా మెదక్ జిల్లాకు ఒరిగేదేమీ లేదని, తెలంగాణ ప్రకటించేట్లయితే తమ జిల్లాను కర్ణాటకలో కలపాలంటూ జయప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నాడంటూ ఎర్రోళ్ల మండిపడ్డారు. జయప్రకాష్ కు మెదక్ జిల్లా సరిహద్దులు కూడా సరిగా తెలియవన్నారు.