: తాగడం ఆలస్యం.. చేతిలో కరిగిపోయే కోక్ బాటిల్


కోకకోలా ఇప్పుడొక సరికొత్త సీసాలో విడుదలైంది. కోక్ ను పూర్తిగా ఐస్ తో తయారు చేసిన సీసాలో నింపి విక్రయిస్తున్నారు. తాగడం ఆలస్యం.. క్షణాల్లోనే అది కరిగిపోతుంది. పూర్తిగా పర్యావరణ ప్రయోజనకరమైన ఈ సీసా నిజంగా సరికొత్త ప్రయోగం. ప్రస్తుతానికి ఈ ఐస్ కోకకోలాలు కొలంబియాలోనే లభిస్తున్నాయి. సీసా ఆకారంలో ఉన్న సిలికోన్ అచ్చుల్లో నీటిని నింపి, మైనస్ 13 డిగ్రీల ఫారిన్ హీట్ ఉష్ణోగ్రత వద్ద ఫ్రీజర్ లో ఉంచుతారు. అనంతరం అందులో కోక్ ను నింపి మళ్లీ కరిగిపోకుండా ఫ్రీజర్ లోనే పెడతారు. కొన్నప్పుడు ఆ బాటిల్ కు కోకకోలా స్ట్రిప్ అంటించి ఇస్తారు. దాంతో పట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. మన దగ్గరకు కూడా తొందరగా వచ్చేస్తే బావుండును కదా?

  • Loading...

More Telugu News