: 'సర్, అమ్మాయి ఫోన్ చేసింది... ఏం చేయమంటారు?'


అమ్మాయి ఫోన్ చేసింది... ఏం చేయమంటారు? అని ప్రముఖ క్రికెటర్ అడిగాడు.. నమ్మలేకపోతున్నారు కదా, ఇప్పుడిది చదవండి. భారత క్రికెట్ లో బ్యాట్స్ మన్ హవా నడుస్తోంది. కానీ, సన్నగా పొడుగ్గా లేతదనం ఇంకా వసివాడని పేస్ బౌలింగ్ సంచలనం భువనేశ్వర్ కుమార్, క్రమశిక్షణతో పట్టుదలగా ఒక్కో మెట్టెక్కుతున్నాడు. అతని బౌలింగ్ ప్రదర్శనకి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మరి అందులో అమ్మాయిలు కూడా ఉంటారు కదా! ఉన్నట్టే వాళ్లలో ఒక వీరాభిమాని అతగాడికి ఫోన్ చేసి, తన మనసులో ముచ్చట చెప్పేసింది. అభిమాని అంటూ ఫోన్ చేసి మనసులో మాట చెప్పేసరికి బిత్తరపోయిన భువనేశ్వర్ మరో నిమిషం ఆలస్యం చేయకుండా కోచ్ విపిన్ వత్స్ కు ఫోన్ చేశాడు. 'సర్ అమ్మాయి ఫోన్ చేసింది. ఏం చేయమంటారు?' అని అడిగేశాడు.

అతని కంటే సీనియర్లను తీర్చిదిద్దిన విపిన్, "నాయనా భువన్...నీ సంపాదనెంత' అనడిగాడు. దానికి భువనేశ్వర్ 'లక్షల్లో సర్' అని సమాధానమిచ్చాడు. 'నిజం చెప్పు' అంటే 'కోట్లలో సర్' అని నసిగాడు. దీంతో, 'మర్చిపోకుండా గుర్తుంచుకో... ఇప్పుడు 'క్రికెటే నీకు సర్వస్వం, బాగా ఆడావనుకో, అన్నీ వాటంతట అవే వస్తాయి. 25 ఏళ్లు వచ్చేవరకూ ఆటపైనే మనసు లగ్నం చేయి. అప్పుడు నీకు వయస్సు వస్తుంది. ఆటతోపాటు ఇలాంటి వాటిని ఎదుర్కోగలిగే అనుభవమూ సొంతమవుతుంది. అప్పుడు పెళ్లితో పాటు జీవితాన్ని కూడా అనుభవించొచ్చు'' అంటూ సలహా ఇచ్చాడు. 'నిజమే సర్, అందుకే ఈ విషయం మీతో పంచుకున్నా'నని భువనేశ్వర్ సమాధానమిచ్చాడట. ఈ విషయాన్ని కోచ్ తెలిపారు.

  • Loading...

More Telugu News