: ఏపీ భవన్లో భారీ భద్రత
ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందనే ఊహాగానాలతో, రెండు ప్రాంతాల నేతలు ఢిల్లీలోని ఏపీభవన్ కు తమ వందిమాగధులను వెంటేసుకొచ్చారు. తెలంగాణా, సీమాంధ్రకు చెందిన వారంతా ఇక్కడే ఉండడంతో ఉద్రిక్తపరిస్థితులు తలెత్తే అవకాశముందని ముందస్తుగా పోలీసులను మోహరించారు. హస్తినలో తెలంగాణ, సమైక్య వాదాలతో వాతావరణం వేడెక్కింది.