: పోలీసు తనిఖీల్లో అడ్డంగా దొరుకుతున్న లక్షలాది రూపాయలు
నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న లక్షలాది రూపాయల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం నిజాంసాగర్ మండలం నర్సింగరావు చౌరస్తావద్ద 18 లక్షల రూపాయల్ని పట్టుకున్న పోలీసులు, తాజాగా బాల్కొండ మండలం పోచంపాడు రహదారి వద్ద 35 లక్షల రూపాయల్ని పట్టుకున్నారు. వాహనాల తనిఖీలో ఇంత భారీ మెత్తంలో డబ్బులు పట్టుబడుతుండడం జిల్లాలో సంచలనం రేపుతోంది. డబ్బు స్వాధీనం చేసుకుని, కారులో డబ్బుతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణీకుడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.