: శ్రీలంక సర్కార్ పై మండిపడ్డ జయలలిత


ఎల్టీటీఈ అధినేత వేలు పిళ్లై ప్రభాకరన్ కొడుకు పన్నేండేళ్ల బాలచంద్రన్ ను శ్రీలంక సైన్యం దారుణంగా చంపిన ఘటనపై బ్రిటన్ కు చెందిన చానెల్ 4 రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, 'ఇది అత్యంత క్రూరమైన పాశవిక చర్య' గా అభివర్ణించారు.

ఇది
యుద్ధ నేరమని ఆమె వ్యాఖ్యానించారు. మార్చిలో జెనీవాలో జరగనున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సదస్సులో శ్రీలంకకు వ్యతిరేకంగా హక్కుల ఉల్లంఘనను భారత్ అమెరికాతో కలిసి ప్రవేశపెట్టాలని జయ డిమాండు చేశారు. దీని ద్వారా లంక స్వభావం తెలుస్తోందని చెన్పైలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం అన్నారు. మరోవైపు లంక ప్రభుత్వం ఈ చర్యలను సమర్థించుకుంది. తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేసింది.

  • Loading...

More Telugu News