: ఆస్తి కోసం అన్నను అడ్డంగా నరికిన తమ్ముడు


ఆస్తి కోసం తోడబుట్టిన అన్నను అత్యంత పాశవికంగా తమ్ముడు నరికి చంపాడు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో కొండగేరిలో నందన కుర్వఅల్లెన్నను అతని సోదరుడు కుర్వపుల్లన్న వేటకొడవలితో దారుణంగా నరికి చంపాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ హత్యతో పత్తికొండ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన అల్లెన్న భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అల్లెన్న, పుల్లన్న మధ్య గత కొంత కాలంగా ఆస్తి విషయంలో వివాదం కొనసాగుతూ ఉంది. దాని కోసం వీరు పలు మార్లు గొడవలు పడ్డారు. చివరికి అన్నను తమ్ముడు కడతేర్చాడు.

  • Loading...

More Telugu News