: ఇన్ఫోసిస్ లాభంలో స్వల్ప వృద్ధి .. భారీగా పెరిగిన షేరు ధర
దేశీయ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలకు తగినట్లుగానే జూన్ త్ర్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 2,374 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. గతేడాది జూన్ త్రైమాసికంలో ఆర్జించిన 2,289 కోట్ల రూపాయల లాభంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసిక లాభం 3.7 శాతం పెరిగింది. ఆదాయాలు కూడా 17.2శాతం పెరిగి 11,267 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రూపాయి విలువ క్షీణిస్తున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డాలర్ ఆధారిత ఆదాయ అంచనాలను కంపెనీ మార్చలేదు. అంచనాలకు తగినట్లుగానే ఫలితాలు ఉండడంతో స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్ షేరు 11.65 శాతం పెరిగి 2,822 రూపాయల వద్ద ట్రేడవుతోంది.