: ఈ డైపర్లు సూపరు!


మీ పిల్లలకు డైపర్లు వాడుతున్నారా... అయితే ఇలాంటి డైపర్లను వాడి చూడండి. ఎందుకంటే, మీ చిన్నారుల్లోని అనారోగ్య లక్షణాలను ఇవి ఇట్టే గుర్తుపట్టేస్తాయి. అంతేకాదు, మీకు ఈ విషయాన్ని చేరవేస్తాయి కూడా. దీంతో మీరు చక్కగా అలర్టై మీ పిల్లలను వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లవచ్చు.

ఇప్పటి ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌తో పలు అంశాలను ముడిపెడుతున్నారు. ఇప్పుడు చిన్నారులకు వాడే డైపర్లలో కూడా ఈ అప్లికేషన్‌ను ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలకు వాడే డైపర్లలో స్మార్ట్‌ఫోన్‌ అమర్చి కొత్తరకం డైపర్లను తయారు చేశారు. ఈ డైపర్లు పిల్లల్లో కలిగే కొన్నిరకాల అనారోగ్యాలను ఇట్టే గుర్తుపట్టేస్తాయి. అంతేకాదు, సదరు అనారోగ్యాలకు సంబంధించిన వివరాలను కచ్చితంగా వైద్యులకు స్మార్ట్‌ఫోన్‌ ద్వారా అందజేసేస్తాయి. పిల్లల్లో మూత్ర సంబంధమైన ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వంటి అనారోగ్యాలను ఈ డైపర్లు ఇట్టే గుర్తుపట్టేయగలవు. ఈ డైపర్లకు ముందు భాగంలో రంగురంగుల చదరాలున్న ప్రాంతం బాక్టీరియా, ప్రొటీన్‌ తదితరాలను గుర్తిస్తుంది. ఆయా రంగుల చదరాల్లో సంభవించే మార్పులను స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ ఎప్పటికప్పుడు ఫోటో తీస్తుంది. రంగుల్లో మార్పులను బట్టి రసాయనికపరమైన పరిణామాలను విశ్లేషించి, వాటికి సంబంధించిన వివరాలను వైద్యులకు అందజేస్తుంది. ఇన్ని ప్రత్యేకతలను కలిగివున్న ఈ స్మార్ట్‌ డైపర్లను మరోసారి ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఈ ప్రయోగాలు పూర్తయిన తర్వాత ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.

  • Loading...

More Telugu News