: చచ్చి బతికింది!!
చనిపోయిందనుకున్న మహిళ ఉన్నపాటుగా కళ్లు తెరవడంతో అవాక్కవడం వైద్యుల వంతైంది. అంతేకాదు, మీరు పొరబడ్డారంటూ దీనికి వారిపై ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతోబాటు సదరు మహిళకు వైద్యం చేసిన ఆసుపత్రి యాజమాన్యానికి భారీ మొత్తంలో జరిమానా కూడా విధించింది.
కొలీన్ బర్న్స్ అనే 41 ఏళ్ల మహిళ కొన్ని ఔషధాలను మోతాదుకు మించి తీసుకుంది. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటనే చికిత్స మొదలుపెట్టిన వైద్యులు పరిస్థితి విషయమించడంతో వెంటిలేటర్‌ను ఏర్పాటు చేసి తిరిగి చికిత్స ప్రారంభించారు. చివరికి ఆమె మరణించిందని నిర్ణయించారు. ఇదే విషయాన్ని కొలీన్ కుటుంబ సభ్యులకు తెలిపి వారి అనుమతి మేరకు ఆమెకు వెంటిలేటర్‌ను తొలగించారు. అనంతరం మరణించిందని భావించిన కొలీన్ దేహంనుండి అవయవాల సేకరణకు ఉపక్రమించారు. ఇంతలో కొలీన్ కళ్లు తెరిచింది. దీంతో ఒక్కసారిగా అటు వైద్యులు, ఇటు కొలీన్ కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. 2009లో జరిగిన ఈ విషయాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించిన ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి గత సెప్టెంబరులో సంబంధిత ఆసుపత్రికి భారీ జరిమానా విధించింది. తీవ్రమైన కోమాలో ఉన్న కొలిన్‌కు వైద్య పరీక్షల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది నిజంగా తమను దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ కొలీన్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుండగా, తమకు కూడా ఇదే పరిస్థితి అని, అసలు లోపం ఎక్కడ జరిగిందో తెలియడం లేదని వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.