: భూమి అంచులదాకా వెళ్లి భోజనం చేయొచ్చు!
మీరు భూమి అంచులదాకా వెళ్లి చూశారా... వెళ్లే అవకాశం రాలేదా... అయితే ఇదిగో అవకాశం... మీ కోసమే... మీ దగ్గర ఓ 85 లక్షలుంటే చాలు... అంతే.. మీరు ఎంచక్కా భూవాతావరణం అంచులదాకా వెళ్లి అక్కడినుండి భూమిని చూస్తూ భోజనం చేయొచ్చు... ఒక సంస్థ మీలాంటి వారికోసమే ఇలాంటి అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధపడుతోంది.
జీరో2గ్రావిటీ అనే సంస్థ, మీకు ఆసక్తి ఉంటే మిమ్మల్ని అంతరిక్షానికి చాలా దగ్గరగా తీసుకెళతామని చెబుతోంది. ఎంత దగ్గరగా అంటే భూమినుండి 36 కిలోమీటర్ల ఎత్తుదాకా... అంటే ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే కంకార్డ్ విమానం ఎగిరే ఎత్తుకంటే కూడా చాలా ఎత్తు వరకూ మిమ్మల్ని తీసుకెళుతుందట. అదికూడా పారాచ్యూట్ లాంటి ఒక పెద్ద బలూన్ సహాయంతో పర్యాటకులను ఇలా భూమినుండి ఎత్తుకు తీసుకెళతామని ఆ సంస్థ చెబుతోంది. అక్కడికి తీసుకెళితే చక్కగా మన భూమిని పైనుండి పరికించవచ్చు. అంతేనా... ఎంచక్కా అక్కడినుండే మనం లంచ్ కూడా చేయొచ్చు. అయితే దీనంతటికీ ఖర్చు కేవలం 95 వేల పౌండ్లు మాత్రమే చెల్లిస్తే చాలట. అంటే మన రూపాయిల్లో రూ.85 లక్షలు మాత్రమే. వెళ్లాలనుకునేవారు వెంటనే సిద్ధంకండి మరి!