: లంక ఓపెనర్లను బుట్టలో వేసిన భువనేశ్వర్
ముక్కోణపు సిరీస్ ఫైనల్లో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ కొత్తబంతితో నిప్పులు చెరిగాడు. బంతి మెరుపు తగ్గకముందే లంక ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. ఈ యువ బౌలర్ ధాటికి లంక జట్టు 13.1 ఓవర్లలో 49 పరుగులకే ఓపెనర్లు జయవర్థనే (22), ఉపుల్ తరంగ (11) వికెట్లను చేజార్చుకుంది. ఈ టైటిల్ పోరులో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదిక.