: జైల్లో ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు: సుప్రీం


ఓటు వేసేవారికే చట్ట సభలకు పోటీచేసే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరచరిత గల వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసే విషయమై నిన్న తీర్పునిచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. జైల్లోనూ, పోలీసుల అదుపులోనూ ఉన్న వ్యక్తులు ఓటు వేసే హక్కును కోల్పోతారని, తద్వారా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులవుతారని విపులీకరించింది. అయితే, పోలీసులు బైండోవర్ కేసుల్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు ఇది వర్తించదని సుప్రీం పేర్కొంది.

  • Loading...

More Telugu News