: ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరు: షర్మిల


అన్ని కేసుల నుంచి జగన్ నిర్దోషిగా బయటికొస్తారని ఆయన సోదరి వైఎస్ షర్మిల అన్నారు. విజయనగరం జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల కొటారిబిల్లి జంక్షన్ వద్ద ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. జగన్ త్వరలోనే బయటికొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రాజమండ్రి సభలో జగన్ పార్టీపై విమర్శల వర్షం కురిపించిన ఎంపీ ఉండవల్లిపై మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కించిత్ మాట కూడా అనకుండా, కేవలం జగన్ లక్ష్యంగానే విమర్శలు చేశారని షర్మిల ఆరోపించారు. కాగా, తన ప్రసంగానికి ముందు కొటారిబిల్లి జంక్షన్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News